ప్రధాని మోదీ కెనడా పర్యటన ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 11, 12 తేదీల్లో మోదీ కెనడాలో పర్యటిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడాలోని భారత్ రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ, ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో సమావేశం కానున్నారు. 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 70 బిలియన్ డాలర్లకు చేరుకునేలా ఇరు నేతలు చర్చలు జరపనున్నారు.
వార్తలు
మోదీ కెనడా పర్యటన ఖరారు


