హైదరాబాద్: 28°C
వార్తలు

కర్లపాలెంలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

BPT: కర్లపాలెం మండలంలో శనివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు. కర్లపాలెం 33/11 కేవీ ఉపకేంద్రంలో నెలవారీ మరమ్మతులు, 33 కేవీ ఫీడర్‌ పనులు చేపట్టనున్నారు. దీంతో కర్లపాలెం, గణపవరం ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని బాపట్ల సబ్‌ డివిజన్‌ డీఈ టీ. శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.