హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి ఖర్గే లేఖ

డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాశారు. ఈ బిల్లును పార్లమెంటులో హడావిడిగా ఆమోదింపజేయవద్దని కోరారు. ఈ బిల్లులోని నూతన ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలన్నింటికీ తగినంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. తద్వారా అన్ని వర్గాల వారితో దీనిపై చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు.