ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలను పెంచడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై న్యాయస్థానంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మరో రెండు వారాల్లో నిబంధనలను అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు చెప్పారు. దీంతో నవంబర్ 16లోగా నిబంధనలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.
వార్తలు
టికెట్ ధరలపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు


