హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భిణులకు సీమంతాల కార్యక్రమం

ASR: అరకులోయ మండలంలోని చొంపి అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం గర్భిణులకు సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎల్‌సీసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కంబిడి కృష్ణకుమారి పాల్గొని గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.