హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్య వృద్ధుడు స్టేషన్‌కు

కరీంనగర్ రూరల్ (M) వల్లంపహాడ్‌కు చెందిన వృద్ధుడు వోడ్నాల నర్సయ్యను భూకబ్జా ఆరోపణలపై పోలీసులు స్టేషన్‌కు తరలించడం వివాదమైంది. వారం చికిత్స తర్వాత బుధవారమే ఇంటికి వచ్చిన ఆయనను కుటుంబీకులు లేని సమయంలో SI ఆదేశమంటూ ఆటోలో తీసుకెళ్లారని కుటుంబం ఆరోపించింది. రాత్రి 9.30కి హోంగార్డు బైక్‌పై ఇంటికి తీసుకోచ్చారు. వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.