హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

KDP: పులివెందుల పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో SI సుబహాన్, సిబ్బంది పూల మార్కెట్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పెట్రోలింగ్ చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.