హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరువు మండలంగా ప్రకటించాలి'

NRPT: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలో ఎండిన పంటలను పరిశీలించారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.