హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీ

SDPT: విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి హెచ్చరించారు. శుక్రవారం భూంపల్లి PHCని తనిఖీ చేసి, హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే జీతాల్లో కోత విధించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.