SRD: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం PS పరిధిలోని శ్రీకృష్ణ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఇనుప రాడ్డు ఛాతిలో గుచ్చుకొని మస్తాన్ (45) అనే కార్మికుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన మస్తాన్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధీర్కుమార్ తెలిపారు.
తెలంగాణ
ఘోర ప్రమాదం.. కార్మికుడు మృతి


