KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని డీ-89 కెనాల్ వద్ద రైతులు, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ నాయకులు, రైతుల పోరాటంతో సాగునీరు విడుదలైందని హర్షం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి పంట పొలాలకు నీరందేలా బండి సంజయ్ చొరవ తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం


