MDCL: బాచుపల్లిలో ఇంటి వద్ద ప్రసవం జరుగుతున్న సమయంలో శిశువు మెడకు బొడ్డుతాడు చుట్టుకొని ఉండటంతో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా ప్రసవం చేశారు. నేపాల్కు చెందిన గర్భిణీకి(19) ఆడశిశువు జన్మించింది. 108 అత్యవసర వైద్య సిబ్బంది ఈఎంటీ కలిమి లక్ష్మణ్, పైలట్ రాజు రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
మెడకు బొడ్డుతాడు చుట్టుకున్నా.. సురక్షిత ప్రసవం


