SKLM: పోలీస్ శాఖలో 11 వేల పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. శుక్రవారం క్రాంతి భవన్లో మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేయాలన్నారు. పోలీస్ శాఖలో 20 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించి ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్'


