హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్లో అన్నదాన సేవలు

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని అన్న క్యాంటీన్‌లో శుక్రవారం డాక్టర్ పైడి సింధూర బృందం అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. సుమారు 600 మందికి భోజనం అందించారు. పేదల ఆకలి తీర్చడం సంతృప్తినిచ్చే సేవని, అన్న క్యాంటీన్లు పేదలకు అండగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.