హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో తొలి నామినేషన్ దాఖలు

PLD: వినుకొండ పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా వినుకొండ పురపాలక సంఘంలోని 6వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా దేవరపల్లి కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన కిషోర్‌ వినుకొండలో తొలి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిగా నిలిచారు.