హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారిలో ఆక్రమణలు తొలగించాలి'

SKLM: కొత్తూరు మండల కేంద్రానికి సమీపంలోని పారాపురం గ్రామంలో దళితుల శ్మశానవాటికకు వెళ్లే రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, దారి కల్పించేందుకు సహకరించాలని తహసీల్దార్ రజని సంబంధిత రైతులను కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో, శుక్రవారం ఆమె రైతులతో చర్చించి రహదారి ఏర్పాటుకు సహకరించాలని సూచించారు.