హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NGKL: బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో కొలువైన వెంకటేశ్వర స్వామిని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.