ప్రకాశం: కొమరోలు మండలంలోని ఇస్లాంపేట వీధిలో తాగునీరు సరఫరా కావడం లేదని ఆగ్రహించిన స్థానికులు శుక్రవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. సుమారు 20 మంది మహిళలు, స్థానికులు పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన స్థానికులు


