హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఆలయంలో ఎమ్మెల్యే పూజ

MBNR: రాజాపూర్‌ మండలం చొక్కంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని, జడ్చర్ల నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.