హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత రవి అరెస్టును ఖండించిన కాసు

PLD: దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఇంటి కార్ పార్కింగ్‌లో పోలీసులే లిక్కర్ బాటిళ్లు పెట్టి కేసు బుక్ చేశారని, ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని విమర్శించారు. దీనిపై సీఐని కలుస్తామని, అనంతరం హైకోర్టుకు వెళతామన్నారు.