హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కళ్యాణ లక్ష్మితో పేదింటి కుటుంబానికి ఆర్థిక భరోసా

ADB: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదింటి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం బోథ్, సోనాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి కుటుంబానికి ఆర్థిక భారం కాకుండా ఉండడానికి గత BRS ప్రభుత్వంలో ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.