హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు

KMR: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న క్యాన్సర్ చికిత్స వార్డును శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకట్ సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, చికిత్స విధానం, సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.