హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అమరవీరుల సంస్మరణ సైకిల్ ర్యాలీ

VKB: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో తాండూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు సాగిన ఈ ర్యాలీలో డీఎస్పీ నర్సింహయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.