హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణ ఆరోపణలు.. అధికారుల పరిశీలన

GDWL: అలంపూర్‌లో 2009 వరద బాధితులకు ప్రభుత్వం కేటాయించిన 43 ఎకరాల ఇళ్ల స్థలాలకు వెళ్లే 60 అడుగుల ప్రధాన రహదారి ఆక్రమణకు గురవుతోందన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. శుక్రవారం MRO ప్రభాకర్‌ సమక్షంలో సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. వరద బాధితుల ఇళ్ల స్థలాలు, రహదారిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.