హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ పరిశీలన

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెనాలిలోని జేఎంజే కాలేజీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.