హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా SC,ST విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హుజూర్‌నగర్ వ్యక్తి

SRPT: సూర్యాపేట జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన పోతుల జ్ఞానయ్య నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.