దుబాయ్-హైదరాబాద్ విమానం ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమిరేట్స్ విమానం ల్యాండింగ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న ప్రయాణికుడి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ముంబైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


