హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనులపై కమిషనర్ తనిఖీలు

W.G: నరసాపురం పట్టణంలోని పలు స్వర్ణ సచివాలయ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీలు, వీధుల శుభ్రతను తనిఖీ చేసి, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజూ చెత్త సేకరణతో పాటు బ్లీచింగ్, ఫాగింగ్ పనులను నిరంతరం పర్యవేక్షించారు.