హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా రాజీనామా చేయాలి: మంత్రి పొన్నం

ఢిల్లీలో జరిగిన ఘటనలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ 'ఎక్స్' వేదికగా డిమాండ్ చేశారు. దేశంలో సుప్రీంకోర్టుపై కేంద్రానికి గౌరవం లేదని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ తీరును దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.