AP: విశాఖ విమానాశ్రయం నుంచి సివిల్ విమాన సర్వీసులను భోగాపురానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. భోగాపురం-విశాఖ మధ్య రహదారి పూర్తయ్యే వరకైనా డొమెస్టిక్ విమానాలు నడపాలని కోరిన పిటిషనర్ల విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
వార్తలు
దానిపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు


