AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వారు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
వార్తలు
ఇంద్రకీలాద్రికి చంద్రబాబు దంపతులు


