TG: దసరా సెలవుల్లో విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంఈఓ కార్యాలయాలు, జూనియర్ కాలేజీల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ తెలిపింది. కొత్త ఎన్రోల్మెంట్లతో పాటు పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
దసరా సెలవుల్లోనూ ఆధార్ సేవలు


