హైదరాబాద్: 28°C
వార్తలు

కమీషన్ల దందాకు అడ్డాగా సీఎం ఆఫీస్: కవిత

తెలంగాణ CMOను కమీషన్లకు అడ్డగా మార్చేశారని TRS చీఫ్ కవిత 'ఎక్స్'లో ఆరోపించారు. ప్రతి పనికి 15% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదని, పచ్చి దోపిడీ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక లూటీకి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, వ్యవసాయంలో మహిళల శ్రమను గుర్తిస్తూ మహారాష్ట్ర తరహాలో మహిళా రైతుల సాధికారిత చట్టాన్ని TGలోనూ తీసుకురావాలన్నారు.