HYD: బాలానగర్లో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎక్స్రోడ్ వద్ద చిడిగె కృష్ణ (29), మహ్మద్ రైయాన్ (24), మేళం దినకర్ (22)లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.9 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల హ్యాష్ ఆయిల్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 వేలు కాగా, ముగ్గురినీ రిమాండ్కు తరలించారు.
వార్తలు
ఐడీఏ బాలానగర్లో డ్రగ్స్పై పోలీసుల దాడి


