హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్

పాక్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాయాది దేశం వైపు నుంచి మరోసారి భారత్‌లో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. సరిహద్దు తీవ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ రాజీపడబోదని పునరుద్ఘాటించారు. శాంతి, ద్వైపాక్షిక చర్చలకు ఎప్పుడు కట్టుబడి ఉన్నామని, అంతమాత్రాన దాన్ని బలహీనతగా భావించొద్దని సూచించారు.