హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎన్నికల నియమావళి పక్కాగా అమలు: ఈఆర్‌వో

PLD: చిలకలూరిపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఈఆర్‌వో బీ.లీలా రాణి తెలిపారు. షెడ్యూల్‌తోనే కోడ్ అమల్లోకి వచ్చిందని, నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అక్రమ నగదు, మద్యం అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుందని, ప్రజలు, పార్టీలు సహకరించాలని కోరారు.