భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తొలి దశ ఖరారైందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. అమెరికా సుంకాలపై అధికారికంగా స్పష్టత వచ్చాకే.. ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
వార్తలు
భారత్-అమెరికా తొలి దశ ట్రేడ్ డీల్ ఖరారు


