హైదరాబాద్: 28°C
వార్తలు

102 ఏళ్ల వయసులోనూ జగన్పై అభిమానం

VZM:మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో బొబ్బిలికి చెందిన 102 ఏళ్ల కాసా జగ్గయ్యమ్మ బుధవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఆమెను ఆప్యాయంగా పలకరించిన జగన్‌ పెద్దావిడ ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా తన అభిమాన నాయకుడిని చూసేందుకు వచ్చిన జగ్గయ్యమ్మను చూసి వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.