హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జల్గావ్ జిల్లాలో ట్రక్కు, బైక్ ఢీ కొని ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.