హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ పోస్టులకు 1,078 దరఖాస్తులు

నిర్మల్‌ జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ పోస్టులకు మొత్తం 1,078 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. భైంసా ప్రాజెక్టు పరిధిలో 22 పోస్టులకు 816, ముధోల్‌ ప్రాజెక్టు పరిధిలో 12 పోస్టులకు 262 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, త్వరలో మెరిట్‌ జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.