హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపైనే చెత్త, నిర్మాణ వ్యర్థాలు!

HYD: బన్సీలాల్‌పేట నల్ల పోచమ్మ ఆలయం కమాన్ వద్ద రోడ్డుపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారిపై చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి చెత్తను, నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని స్థానికులు వ్యక్తం చేశారు.