HYD: మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఆయన అందించిన సేవలు భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని రాంచందర్ రావు పేర్కొన్నారు. బలమైన భారతదేశ నిర్మాణం కోసం శ్రమించిన కలాం ఆశయాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయన్నారు.
తెలంగాణ
VIDEO: అబ్దుల్ కలాం సేవలు దేశానికి మార్గదర్శకం: బీజేపీ చీఫ్


