హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు విత్తనాలను అందజేసిన వ్యవసాయ అధికారి

GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఏవో నాగార్జున రెడ్డి రాయితీలో మినుము పంట విత్తనాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. రైతులు రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.