SRPT: నడిగూడెం మండలం వల్లాపురంలో DMFT నిధులతో ఈ రోజు పశు ఆరోగ్య, ఫలదీకరణ శిబిరం నిర్వహించారు. సర్పంచ్ సరిత పాల్గొని రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎదకు రాని, చూలి కట్టని పశువులకు చికిత్స అందించి, దూడలకు నట్టల మందు, కాల్షియం టానిక్లు ఇచ్చారు. ఎల్నినో ప్రభావం నుంచి పశువులను కాపాడుకునే చర్యలను డాక్టర్ ఎం. రవికుమార్ వివరించారు.
తెలంగాణ
వల్లాపురంలో పశు వైద్య శిబిరం


