హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాల్వంచలో పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు

BDK: పాల్వంచలో పిచ్చికుక్క దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల్లో ఒక కుక్క 14 మందిపై దాడి చేసి కరిచినట్లు సమాచారం. వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో ఎప్పుడు, ఏ వైపు నుంచి కుక్క దాడి చేస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.