HYD: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మను 5వ రోజు లలితా దేవిగా అలంకరించారు. వేకువజాము నుంచి పవిత్ర గంగాజలాలు, పంచామృతాలతో అభిషేకించి రంగు రంగుల గాజులతో గర్భగుడిని సుందరంగా అలంకరించి అమ్మకు నైవేద్యం సమర్పించారు. గాజుల నడుమ ఎల్లమ్మ దేదిప్యమానంగా వెలిగిపోతున్నారు. వివిధ రంగుల పూలు, పట్టు చీరలతో అమ్మవారి అలంకరణ సుందరంగా ఉంది.
తెలంగాణ
VIDEO: గాజుల నడుమ బల్కంపేట ఎల్లమ్మ


