JN: పాలకుర్తి మండల నూతన ఎస్సైగా సృజన్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా దేవరుప్పుల పోలీస్ స్టేషన్ నుంచి పాలకుర్తికి బదిలీపై వచ్చారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండేలా పనిచేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ
పాలకుర్తి SIగా సృజన్ కుమార్


