హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యే GMR సమీక్ష

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) అధికారులతో చర్చించారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ.. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.