GNTR: చేబ్రోలు (M) వేజండ్ల SC కాలనీలో దొంగతనం జరిగిన ఘటన చోటుచేసుకుంది. వరకుమార్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు రూ.4 లక్షలు తెచ్చుకున్నారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇవ్వగా, మిగతా రూ.3.9 లక్షలు పరుపు కింద పెట్టుకొని నిద్రపోయారు. ఉదయం చూసేసరికి ఆ డబ్బు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో PSలో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరుపు కింద పెట్టిన రూ.3.9 లక్షలు చోరీ!


