హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారుణ హత్య.. భార్యను చంపిన భర్త

అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ లాడ్జిలో భార్య తలపై బీర్ బాటిల్‌తో దాడి చేసి భర్త నవీద్ భాష హత్య చేసినట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. మృతురాలు కర్ణాటకలోని కోలార్ జిల్లా ముళబాగల్‌కు చెందిన మహిళగా గుర్తించారు. హత్య అనంతరం నిందితుడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.